మంగళవారం 26 మే 2020
Telangana - May 14, 2020 , 10:59:38

ధర్మసాగర్‌ నుంచి దేవాదుల కాల్వలకు నీటి విడుదల

ధర్మసాగర్‌ నుంచి దేవాదుల కాల్వలకు నీటి విడుదల

వరంగల్‌ అర్బన్‌ : ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ సౌత్‌ కెనాల్‌ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, టి. రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలువల ద్వారా వర్దన్నపేట, స్టేషన్‌ ఘనపూర్‌, పరకాల ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలు, 33 గ్రామాల్లో 91,700 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ వల్లే దేవాదుల నుంచి 365 రోజుల పాటు నీళ్లు ఎత్తిపోస్తున్నామన్నారు. కాళేశ్వరం, దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జ్లిలా సస్యశ్యామలం అవుతుందన్నారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రైతుల ధర్నాలు లేవన్నారు. రూ. 30 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. విపత్కర సమయంలో రైతు బంధు, రుణమాఫీకి నిధులు విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తుందన్నారు.logo