బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 19:04:17

గజ్వెల్‌ పల్లెల్లోకి గోదారమ్మ పరవళ్ళు

గజ్వెల్‌ పల్లెల్లోకి గోదారమ్మ పరవళ్ళు

గజ్వెల్‌ మండలం అక్కారం సర్జిపూల్‌లో గోదావరి నీళ్లను నింపారు అధికారులు. ఈ రోజు కొడకండ్ల వద్ద  మల్లన్నసాగర్‌ నుండి కొండపోచమ్మకు రిజర్యాయర్‌కు వెళ్లే ప్రధాన కాలువ గేట్లను ఎత్తడంతో అక్కారం వైపు నీళ్లు పరుగులు తీశాయి. ఇప్పటికే అక్కారం పంప్‌హౌజ్‌లోని ఒకటవ నెంబర్‌ మోటర్‌ను వెట్ రన్‌ నిర్వహించడంతో సర్జిపూల్‌కు కొంత మేరకు గోదావరి జలాలను శుక్రవారం సాయంత్రం నింపి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాల రైతులు, ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కాళేశ్వరం ఎస్‌ఈ వేణు, ప్రభుత్వ సలహాదారి పెంటారెడ్డి, నీటి విడుదలకు స్విచ్‌ ఆన్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాణ సంస్థ ప్రతినిధి బ్రహ్మయ్య, ఈఈ బద్రినారాయణ, డీఈ జితెందర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo