గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 12:42:36

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

నిజామాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీలోకి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 19,626 క్యూసెక్కులు కొనసాగుతుండగా, ఔట్‌ఫ్లో 7,613 క్యూసెక్కులుగా ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,089.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90.31 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 83.77 టీఎంసీలు.


logo