బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 01:51:11

నీళ్లుంటేనే పండుగ: స్మితాసబర్వాల్‌ ట్వీట్‌

నీళ్లుంటేనే పండుగ: స్మితాసబర్వాల్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘నీళ్లంటే జీవితం.. నీళ్లుంటేనే పండుగ’ అంటూ ట్విట్టర్‌ వేదికగా సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ స్మితాసబర్వాల్‌ ట్వీట్‌ చేశారు. దీనితో పాటు మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించిన వీడియోను జత చేశారు. ఈ సందర్భంగా ‘నీళ్లంటే జీవితం.. మిషన్‌ భగీరథ 1.47 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయడంతో పాటు 55 లక్షల గృహాలకు చేరింది. అందరూ దీపావళిని సంతోషంగా జరుపుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.