మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:22:40

‘సూరమ్మ’ రీడిజైనింగ్‌తో మేలు

‘సూరమ్మ’ రీడిజైనింగ్‌తో మేలు

  • 67 వేల ఎకరాలకు నీరు
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

కథలాపూర్‌: సూరమ్మ రిజర్వాయర్‌ రీడిజైనింగ్‌తో జగిత్యాల జిల్లా కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని 67 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారులు సర్వే చేసి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం ఇప్పపల్లిలో ఈఎన్సీ అనిల్‌కుమార్‌తో కలిసి ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. 

అనంతరం రైతులు, అధికారులతో కలిసి ప్రా జెక్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సూరమ్మ రిజర్వాయర్‌ రీడిజైనింగ్‌తో కొత్తగా 25వేల ఎకరాలకు నీరందుతుందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతోనే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టామని, ఇప్పుడు వరద కాలువ నీళ్లతో కళకళలాడుతున్నదని చెప్పారు. మరోవైపు ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా సూరమ్మ రిజర్వాయర్‌ను నింపే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి పాల్గొన్నారు. 


logo