మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 10:39:47

యాసంగిలో సింగూరు నుంచి 40వేల ఎకరాలకు నీళ్లు : మంత్రి హరీశ్‌రావు

యాసంగిలో సింగూరు నుంచి 40వేల ఎకరాలకు నీళ్లు : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : సింగూరు జలాశయం నుంచి యాసంగిలో 40వేల ఎకరాలకు నీళ్లివ్వనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం ఆయన ప్రాజెక్టును సందర్శించిన అనంతరం స్థానిక హరిత హోటల్‌లో ఇరిగేషన్‌, వ్యవసాయ, నేషనల్‌ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందోల్‌, పుల్కాల్‌ మండలాల్లో చెరువులను నీటితో నింపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు కింద నీళ్లు అందిస్తామన్నారు. జిల్లాలో దెబ్బతిన్న 144 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని, కొన్ని వంతెనలు దెబ్బతినడంతో రూ.45కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు చెప్పారు. రోడ్లు పూర్తిగా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. అందోల్, నారాయణఖేడ్‌ హైవేలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో గుర్తించలేకపోయామని, నష్టం జరిగిన పంటలకు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తే పరిహారం అందజేస్తామన్నారు. 170 చెరువులకు 70 చెరువులు నిండగా వంద చెరువులు ప్రాజెక్టు నీటితో పూర్తిగా నింపేందుకు అధికారులను మంత్రి ఆదేశించారు. సంబంధించిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo