బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 12:51:31

బోర్ల నుంచి ఉబికి వ‌స్తున్న నీరు.. ఆనందంలో అన్న‌దాత‌లు

బోర్ల నుంచి ఉబికి వ‌స్తున్న నీరు.. ఆనందంలో అన్న‌దాత‌లు

రాజ‌న్న సిరిసిల్ల : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ర్టంలో భూగ‌ర్భ జ‌లాల మ‌ట్టం పెరిగింది. ఎక్క‌డ త‌వ్వినా నీరు ఉబికి వ‌స్తోంది.  

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో పంట పొలాలలో ఉన్న నాలుగు బోరు మోటార్ల నుంచి నీరు ఉబికి వ‌స్తోంది. దీంతో ఆ పంట పొలాల అన్న‌దాత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా బోరు మోటార్ల నుంచి నీరు ఉబికి వ‌స్తోంద‌ని రైతులు పేర్కొన్నారు. ఈ ఏడాది వ్య‌వ‌సాయానికి ఢోకా లేద‌ని రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 


logo