శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:42

టీఆర్‌ఎస్‌ హయాంలోనే చెరువులకు జలకళ

టీఆర్‌ఎస్‌ హయాంలోనే చెరువులకు జలకళ

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి/రాయికల్‌/రాయికల్‌ రూరల్‌: 45 ఏళ్లుగా నిర్వీర్యమైన చెరువులకు జలకళ తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారంలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. రాయికల్‌లో రూ.కోటి నిధులతో చేపట్టే సంఘ భవనాలకు శంకుస్థాపన, రాయికల్‌ ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రాయికల్‌లో మొక్కలు నాటారు. 


logo