గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 22:42:13

వ‌రంగ‌ల్ ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దాలి..

వ‌రంగ‌ల్ ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దాలి..

హైదరాబాద్ : చారిత్రాత్మ‌క కాక‌తీయ వార‌సత్వ న‌గ‌రం వ‌రంగ‌ల్ ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.  "కుడా మాస్ట‌ర్ ప్లాన్" పై హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిత్వ కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, స‌త్య‌వ‌తి  రాథోడ్  సమీక్ష నిర్వహించారు. కుడా మాస్ట‌ర్ ప్లాన్ పై అంశాల వారీగా వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఢిల్లీ, ముంబ‌యి, కోల్ క‌తా, చెన్నై, భువ‌నేశ్వ‌ర్, అహ్మ‌దాబాద్, బెంగ‌ళూరు, జైపూర్, భోపాల్, తిరువ‌నంత‌పురం, గౌహ‌తీ వంటి 15 న‌గ‌రాల‌ను  ప‌రిశీలించి రూపొందించిన కుడా మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌ణాళిక‌కు మ‌రిన్ని మెరుగులు దిద్దాల‌ని అధికారులకు సూచించారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డుల క‌నెక్టివిటీని, జాతీర ర‌హ‌దారుల‌కు స‌రిగ్గా అనుసంధానం చేయాల‌న్నారు. కుడా ప‌రిధిలో  దురాక్ర‌మ‌ణ‌కు గురైన చెరువులు, కుంట‌లు, వాటి మ‌నుగ‌డ‌, పున‌రుద్ధ‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. అలాగే ఏయే కారిడార్ల‌లో కారిడార్ల‌లో ఏయే ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి? ఇంకా ఏయే పరిశ్ర‌మ‌లు పెట్ట‌డానికి అవకాశాలున్నాయనేది తెలియజేయాలని అధికారులకు నిర్దేశించారు. వర్ష‌పునీటి నిర్వ‌హ‌ణ‌, మురుగునీటి కాలువ‌ల ప‌రిస్థితి ఏంట‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. వీలైన‌న్ని ఎక్కువ హ‌రిత హారం, గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయాల‌ని, అర్బ‌న్ లంగ్ స్పేస్ ల‌ను పెంచాల‌ని సూచించారు. పురావ‌స్తు భ‌వ‌నాలు, దేవాల‌యాలను ప‌రిర‌క్షిస్తూనే, వాటిని ప‌ర్యావర‌ణ స‌హితంగా, ప‌ర్యాట‌కానికి వీలుగా తీర్చిదిద్దాల‌ని మంత్రులు సూచించారు. వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించాల‌న్నారు. గ‌తంలో మంత్రి కేటిఆర్ సూచించిన విధంగా చేసిన మార్పుల‌పై కూడా అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

ఈ సమావేశంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, శాస‌న మండ‌లి స‌భ్యులు క‌డియం శ్రీ‌హ‌రి, శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య‌, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, కుడా చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌న్మంత్ గాంధీ, వ‌రంగ‌ల్ న‌గ‌ర క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, కుడా, వ‌రంగ‌ల్ న‌గ‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు పాల్గొన్నారు. 


logo
>>>>>>