సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 18:32:11

ఓరుగల్లు ఖ్యాతి చాటేలా పారిశుధ్య పనులు

ఓరుగల్లు ఖ్యాతి చాటేలా పారిశుధ్య పనులు

వరంగల్ అర్బన్  : చారిత్రక నగరం ఓరుగల్లు పట్టణం తన  ఖ్యాతిని నిలిపేలా అభివృద్ధి పనుల్లో నూతన ఒరవడితో దూసుకెళ్తున్నది. నగరాన్ని పచ్చదనంతో పరిఢవిల్లడవిల్లేలా చేయడమే కాదు పరిశుభ్రతలో కూడా మేటిగా నిలిపేందుకు బల్దియా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రజా అవసరాలే ధ్యేయంగా ముందుకెళ్తున్నది. ప్రజల అవసరాలను తీర్చేందుకు నగర పాలక సంస్థ  ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నది.

అందులో బాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. నగరాన్ని మరింత క్లీన్ సిటీగా మార్చేందుకు బహిరంగ ప్రదేశాలలో మూత్ర, మల విసర్జన చేయకుండా నిరోధించేందుకు ప్రధాన కూడళ్లు, బస్టాండు సమీపంలో  ఆటో అడ్డాల వద్ద లోకల్ బాస్ స్టాఫ్ , జన సమూహాల వద్ద పెద్ద కూడలి  స్లం ఏరియాలో తో పాటు వ్యాపార వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో  ప్రజలు అవసరాలను తీర్చేందుకు నగర పాలక సంస్థ కోట్ల రూపాయలను వెచ్చించి టాయిలెట్స్ నిర్మాణాలను చేపట్టింది. 


వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత  పెద్ద నగరం  స్పోర్ట్స్ , హెల్త్,  ఎడ్యుకేషన్, సాంస్కృతిక హబ్,  పర్యాటక హబ్ గా పేరు గాంచింది. జిల్లాకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా మహారాష్ట్ర  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరి హద్దు ప్రజల తో పాటుగా రోజు వారీగా వచ్చే పల్లె ప్రజల వేల సంఖ్య లో రాక పోకాలు సాగిస్తున్నారు . ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు  పట్టణ ప్రజలు కూడా ఈ మరుగు దొడ్ల తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మరుగుదొడ్లు లేక ముఖ్యంగా మగ వారి కంటే మహిళలకు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలో గాని నగర  పాలక సంస్థల్లో  నిర్మించిన వాటిల్లో 50  శాతం మహిళలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.  మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్1000 జనాభా కు ఒక మరుగుదొడ్డి నిర్మించాలని ఖచ్చితమైన నిబంధనలు పెట్టారు.  

ఆ నిభందనలు మేరకు నగర పాలక సంస్థ  టాయిలెట్ నిర్మాణాలను చేపట్టింది. వరంగల్ నగర జనాభాకు సరిపడా  మొత్తం  819 మరుగు దొడ్లు అవసరం.  ఇప్పటి వరకు నగరంలో పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్  సంభందించిన  555 మరుగు దొడ్లు ఉన్నాయి. సుమారు 2 కోట్ల 50 లక్షల వ్యయంతో  మిగతా  264  మరుగు దొడ్ల నిర్మాణా పనులను చేపట్టారు. అవి వివిధ ప్రగతి దశలో కలవు వేగవంతంగా పూర్తి చేసేందుకు నగర పాలక కమిషనర్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ  అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజల అవస్థలను తీర్చేందుకు అందుబాటులోకి తీసుకొని రావడానికి  బల్దియా విశేష  కృషి చేస్తున్నది .logo