సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:40:11

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కు

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ నాయకులు ప్రైవేటు హాస్పిటల్స్‌తో కుమ్మక్కై సర్కార్‌ దవాఖానలపై విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. సోమవారం చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎంజీఎం వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే కాంగ్రెస్‌ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి రేయింబవళ్లు కరోనా బాధితులకు సేవ చేస్తున్న వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌ దవాఖానలో విధుల్లో ఉన్న డాక్టర్స్‌పై అక్కడి కాంగ్రెస్‌ నాయకుడు తన స్థాయిని మరిచి దాడికి దిగడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే కాంగ్రెస్‌ నాయకులు ఎంజీఎంలోని కరోనా వార్డుకు వెళ్లి బాధితులతో మాట్లాడాలని, ఏ ఒక్కరైనా వైద్యసేవలు అందడం లేదని చెబితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి సవాల్‌ విసిరారు. అంతకుముందు మామునూరు విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు. 


logo