గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 18:17:29

నిట్ క్యాంపస్‌లో కరోనా వైరస్‌ లేదు....

నిట్ క్యాంపస్‌లో కరోనా వైరస్‌ లేదు....

వరంగల్‌: నిట్ క్యాంపస్‌లో కరోనా వైరస్‌ లేదని క్యాంపస్‌ రిజిస్టర్‌ ప్రకటించారు. నిట్ లో  కరోనా వైరస్‌ కలకలం వార్తపై ఆయన స్పందించారు. నిట్ క్యాంపస్‌కు చెందిన పరిశోదన విద్యార్థి అమెరికాలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో హాజరై మార్చి 1వ తేదీన మన దేశానికి తిరిగి వచ్చాడు. అనంతరం విద్యార్థి క్యాంపస్‌కు రాలేదు. తమ స్వస్థలమైన కర్నూల్‌కు వెళ్లాడు. ఈ నెల 8వ తేదీన విద్యార్థి హన్మకొండకు తిరిగి వచ్చి క్యాంపస్‌ బయట ఉంటున్నాడు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో నగరంలోని రోహిని ఆస్పత్రిలో చేరాడు. జిల్లా వైద్యాధికారి సూచనల మేరకు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ నిట్  లో విద్యార్థులందరకీ, ఉద్యోగులకు,  కరోనా వైరస్‌పై అవగాహన కల్పించాం. విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు తప్పని సరిగా వైద్యపరీక్షలు చేసుకున్న అనంతరం మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. 


logo
>>>>>>