శనివారం 30 మే 2020
Telangana - May 15, 2020 , 10:52:49

వరంగల్‌ జిల్లా బ్యాక్‌లాగ్‌ ఖాళీల జాబితా విడుదల

వరంగల్‌ జిల్లా బ్యాక్‌లాగ్‌ ఖాళీల జాబితా విడుదల

వరంగల్‌ అర్భన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ శాఖల్లోని ఎస్‌సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీ పోస్టుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖలలో బ్యాక్‌లాగ్‌ పోస్టులైన జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాం. దానికి సంబంధించిన ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను  http.//warangalurban.telangana.gov in వెబ్‌సైట్‌లో, ఉమ్మడి జిల్లాల జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో ఆఫీసుల్లో జాబితా ఉంచామని పేర్కొన్నారు. ప్రకటించిన జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా వరంగల్‌ అర్భన్‌ కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు.


logo