మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 13:12:08

క‌బ్జాదారుల‌కు త్వ‌ర‌లో నోటీసులు: వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌

క‌బ్జాదారుల‌కు త్వ‌ర‌లో నోటీసులు: వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌

హైద‌రాబాద్‌: ఇప్ప‌టివ‌ర‌కు వ‌క్ఫ్ భూముల‌ను ఎంతోమంది క‌బ్జా చేశార‌ని, త్వ‌ర‌లో వారంద‌రికి నోటీసులు ఇస్తామ‌ని వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌ మ‌హ‌మ్మ‌ద్ స‌లీమ్ ప్ర‌క‌టించారు. వ‌క్ఫ్ బోర్డ్ భూములు రిజిస్ట్రేష‌‌న్ చేసుకున్న‌వారివి కూడా ర‌ద్దు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

కొత్త చ‌ట్టంలో వ‌క్ఫ్ ఆస్తుల‌కు కూడా ప్ర‌త్యేక ప్రాధాన్య‌తనిచ్చార‌ని  వెల్ల‌డించారు. వ‌క్ఫ్ ఆస్తుల‌ను ర‌క్షించేందుకు ముఖ్య‌మంత్రి కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఇంత‌వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి వ‌క్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ఆలోచించ‌లేద‌ని చెప్పారు. దేశంలో ఏకైక సెక్యుల‌ర్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని వెల్ల‌డించారు. తెలంగాణ గంగ‌, జ‌మున త‌హ‌జీబ్ అని చెప్పారు.  logo