గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 15:27:40

అందంగా ఇంగ్లిష్‌ రాయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి

అందంగా ఇంగ్లిష్‌ రాయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి

హైదరాబాద్‌: విద్య అనే నాణేనికి చదువడం, రాయడం అనేవి బొమ్మ,బొరుసులాంటివి. మనం చదివినదాన్ని ప్రెసెంట్‌ చేయాలంటే అందమైన చేతిరాత అవసరం. భావ ప్రకటనకు భాష మూలాధారమైతే అలాంటి భాషకు అక్షరాలు ప్రాణాధారం. హ్యాండ్‌రైటింగ్‌ను బట్టి మనిషి ప్రవర్తన, ఆలోచనను పసిగట్టవచ్చని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. చేతిరాత వల్ల సృజనాత్మకత పెరుగడంతోపాటు మనసు, శరీరం తేలికపడుతాయి. స్కూళ్లో అందంగా రాసేవాళ్లకు అందరూ ఫిదా అవుతారు.

అయితే, చాలామందికి హ్యాండ్‌రైటింగ్‌ ఓ ప్రధాన సమస్యగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా నీట్‌గా రాయలేకపోతారు. అలాంటివారి చేతిరాత మార్చేందుకు అద్భుతమైన ట్రిక్స్‌ను ఆకట్టుకునేలా చెబుతున్నారు ఎజాజ్‌ అహ్మద్‌. సిద్దిపేటకు చెందిన అహ్మద్‌ ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ ఇచ్చారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఆయన వీడియోను మీరూ చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర, ప్రయోజనకర వీడియోలు చూసేందుకు నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaana ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo