మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 15:20:55

ఆదిలాబాద్‌‌ అందాలు చూడాలంటే?

ఆదిలాబాద్‌‌ అందాలు చూడాలంటే?

హైదరాబాద్‌: ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు ఆదిలాబాద్‌ జిల్లా. అడవుల జిల్లాగా పేరొందిన ఈ ఖిల్లాలో సహజ సిద్ధమైన అందాలు ఎన్నో కనివిందు చేస్తున్నాయి.  అందాల కశ్మీరంగా పిలుపుచునే ఈ ఉమ్మడిజిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు..చారిత్రక ప్రదేశాలు కోకొల్లలు.. ఇక్కడ ప్రపంచానికి తెలియని జలపాతాలు..ట్రెక్కింగ్‌ పాయింట్స్‌ కూడా ఉన్నాయి.  ఇవన్నీ తెలియక తెలంగాణప్రాంతంవాళ్లు ఆహ్లాదం, అడ్వెంచర్‌ కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. అలాంటివారికి తమ పుట్టినగడ్డ గొప్పతనాన్ని తెలియజేయాలనే ఆలోచన వచ్చింది కొంతమంది ఆదివాసీ యువతకు. ఆలోచన వచ్చిందే తడవుగా థింక్‌ గ్లోబల్‌..యాక్ట్‌ లోకల్‌ అనే నినాదాంతో ‘ట్రైబ్‌ వైబ్‌ అడ్వెంచర్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆ వెబ్‌సైట్‌ గురించి, అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్న ఆ ఆదివాసీ యువత గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి.. మరిన్ని ఆకట్టుకునే కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo