బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 12:23:52

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఉంది : నాబార్డ్ చైర్మన్ గోవింద రాజులు

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఉంది : నాబార్డ్ చైర్మన్ గోవింద రాజులు

రంగారెడ్డి: నాబార్డు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు 60 నుంచి 70వేల కోట్లు ఇవ్వలనుకున్నామని నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు తెలిపారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సీతారాంపేట గ్రామ సమీపంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులపై చాలా ప్రేముందన్నారు. నేను నాబార్డ్ చైర్మన్ గా ఎన్నికై మన రాష్ట్రం, మన ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.


రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకుంటున్నాని తెలిపారు. రాష్ట్రంలో బ్యాంక్ లను మోడల్ బ్యాంక్ లుగా మార్చాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వారికి అండగా నిలువాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిరుపేదలను ఆదుకున్నప్పుడే దేశం ముందు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 



logo