మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 13:24:48

తిరుమలకుంటలో పెద్దపులి సంచారం

తిరుమలకుంటలో పెద్దపులి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికంగా కలకలం రేపుతున్నది. నిన్నటికి నిన్న ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడి మరవకముందే తాజాగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో పులి అడుగులు కనిపించచడంతో ఆందోళన రేకికెత్తిస్తున్నది. ఈ రోజు అటవీ శాఖ అధికారులు పులి అడుగులను గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, పులి సంచారంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. logo