ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 15:06:22

సీతంపేట గుట్టలో పెద్దపులి సంచారం

 సీతంపేట గుట్టలో పెద్దపులి సంచారం

పెద్దపల్లి : జిల్లాలోని ముత్తారం మండలం సీతంపేట గుట్టలో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానికంగా  కలకలం రేపుతున్నది. గత వారం రోజులుగా జిల్లా సరిహద్దుల్లో తిరుగుతున్నపెద్దపులి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, మల్హర్, చిట్యాల మండలాల అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్ తెలిపారు.

మానేరు నదిలో పెద్దపులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. మానేరును దాటి జిల్లాలోని ముత్తారం మండలం సీతంపల్లిలోని సీతమ్మగుట్టల్లోకి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
logo