మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:04:31

పడమటినర్సాపురంలో ఎలుగుబంటి సంచారం

పడమటినర్సాపురంలో ఎలుగుబంటి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పడమటినర్సాపురంలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా  కలకలం సృష్టిస్తున్నది. జూలూరుపాడు మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న గుట్ట సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గొర్రెల కాపరులు అధికారులకు తెలిపారు. బుధవారం గ్రామానికి చెందిన బడుగు బాబుతో పాటు మరికొంత మంది గొర్రెల కాపరులు గొర్రెలను మేత కోసం గుట్ట ప్రాంతానికి తోలుకొని వెళ్లగా అక్కడ వారికి ఎలుగుబంటి కనిపించడంతో కేకలు వేసి కర్రలతో వెంబడించారు. దీంతో ఎలుగుబంటి గుట్టపైకి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు.

గుట్ట సమీపంలో ఖాళీగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో కూడా సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి వెంట్రుకలు కాలి గుర్తులు ఆనవాళ్లు ఉండటంతో ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులకు తెలపడంతో గుండెపుడి సెక్షన్‌ డీఆర్‌వో లక్ష్మీనర్సు, ఏఫ్‌బీవో సూరిబాబు, తహసీల్దార్‌ పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ వీరభద్రం సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుళ్తామని తెలిపారు.


logo