శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 08:53:21

తెరుచుకున్న సరళా సాగర్‌ సైఫన్లు

తెరుచుకున్న సరళా సాగర్‌ సైఫన్లు

వనపర్తి :  అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వనపర్తి జిల్లాలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సరళా సాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అధికారులు ఈ ఉదయం నుంచి 2 ప్రైమింగ్‌, 4 హుడ్‌ సైఫన్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆటోమెటిక్‌ సైఫన్‌ సిస్టమ్ గేట్లు కలిగి ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. అరుదైన ఈ వ్యవస్థ కలిగిన ప్రాజెక్టులలో సరళా సాగర్‌ ప్రపంచంలో రెండోది కాగా ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది. సైఫన్లు తెరుచుకోవడంతో జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.