సోమవారం 25 మే 2020
Telangana - Mar 29, 2020 , 11:53:36

వంద కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి...

వంద కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి...

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పది మంది వ్యక్తులు కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హన్వాడ మండలం దొరతండాకు చెందిన పది మంది ఉపాధి నిమిత్తం కర్ణాటకకు వెళ్లారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ప్రతీ రవాణా వ్యవస్థ బంద్‌ అయింది. దీంతో స్వగ్రామం చేరుకునేందుకు వీరంతా నడకను ఆశ్రయించారు. కర్ణాటకలోని చించోలి నుంచి స్వగ్రామం దొరితండాకు దాదాపు 100 కిలోమీటర్ల మేర కాలినడకనే వచ్చారు. అధికారులు వీరికి ప్రభుత్వ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు.


logo