శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 17:19:12

ప్రతీరోజు 2 కిలోమీటర్లు నడిచి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు... వీడియో

ప్రతీరోజు 2 కిలోమీటర్లు నడిచి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు... వీడియో

నిర్మల్‌ : కరోనా ఉధృతితో విద్యాసంస్థలు, ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టాయి. ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ కోసం ప్రయాస పడాల్సి వస్తుంది. ఇటువంటి అనుభవాన్నే చవిచూస్తోంది నిర్మల్‌ జిల్లా రాజూరు గ్రామానికి చెందిన సఫా జరీన్‌. 12ఏండ్ల సఫా 7వ తరగతి చదువుతున్నది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సరిగా లేనందున సఫా జరీన్‌ ఇంటివద్ద నుండి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేకపోతోంది. దీంతో ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి ఉదయం 11 గంటలకల్లా తమ పొలం వద్దకు చేరుకుంటుంది. అక్కడే మంచెపై కూర్చుని 2 గంటలపాటు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతుంది. ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్స్‌ కూడా అక్కడే పూర్తి చేస్తుంది.


logo