శనివారం 30 మే 2020
Telangana - May 09, 2020 , 15:06:48

పట్టణాల్లో ఆస్తిపన్నుపై పరిమితి ఎత్తివేత

పట్టణాల్లో ఆస్తిపన్నుపై పరిమితి ఎత్తివేత

హైదరాబాద్‌ : పట్టణాల్లో ఆస్తిపన్నుపై పరిమితిని ఎత్తివేస్తూ పురపాలకశాఖ నిర్ణయం వెలువరించింది. వార్షిక ఆస్తిపన్ను రూ. 30 వేల వరకు ఉన్న పరిమితిని ఎత్తేసింది. ఆస్తిపన్ను ఎంత ఉన్నా మే 31లోగా పన్ను చెల్లిస్తే 5 శాతం ప్రోత్సాహకం ఇస్తోంది. రెసిడెన్షియల్‌, కమిర్షియల్‌ కేటగిరీల వారీగా ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం వర్తించనుంది. 

రేపట్నుంచి సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమం...

రాష్ట్రంలో రేపట్నుంచి సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి ఆదివారం పది గంటలకు.. పది నిమిషాలు పేరిట నివారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పురపాలకశాఖ రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ముందుకుపోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


logo