శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 14, 2020 , 06:43:45

ప్రత్యేక రైళ్లకు 22 నుంచి వెయిటింగ్‌ లిస్ట్‌

ప్రత్యేక రైళ్లకు 22 నుంచి వెయిటింగ్‌ లిస్ట్‌

హైదరాబాద్‌ : ప్రత్యేక రైళ్లకు ఈ నెల 22 నుంచి వెయిటింగ్‌ లిస్ట్‌ను ప్రారంభిస్తున్నట్టు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఏసీ-3టైర్‌కు 100, 2-టైర్‌కు 50, స్లీపర్‌కు 200, కార్‌చైర్‌కు 100, ఫస్ట్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌కు 20 చొప్పున వెయిటింగ్‌ లిస్ట్‌ను సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా రైళ్ల సంఖ్యను పెంచనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ప్రయాణంలో  సెల్‌ఫోన్‌ సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దని ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే సూచించింది. ప్రత్యేక రైళ్ళు, శ్రామిక్‌రైళ్ళు,  పార్శిల్‌ సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగకుండా దక్షిణమధ్య రైల్వే బుధవారం ప్రత్యేక జాగ్రత్తలు సూచించింది. రైల్వే ట్రాక్‌లపై నడువకూడదని  ప్రయాణికులను హెచ్చరించింది. రైళ్లు  ఎక్కే, దిగే సమయంలో, ట్రాక్‌లపై నడుస్తున్నప్పుడు, సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్దని స్పష్టం చేసింది. ట్రాక్‌ దాటాలంటే ఆర్‌యూబీ, ఆర్‌వోబీలు ఉపయోగించాలని కోరింది. 


logo