ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 12:18:30

స్కేల్ ఉద్యోగులుగా వీఆర్ఏలు : సీఎం కేసీఆర్

స్కేల్ ఉద్యోగులుగా వీఆర్ఏలు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : వీఆర్ఏల‌కు తీపి క‌బురు అందిస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు మాత్ర‌మే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకువ‌స్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ఈ బిల్లును ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. వీఆర్ఏల‌ను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల్లో వీఆర్‌వోల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ సంస్క‌ర‌ణల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు తొల‌గుతాయ‌న్నారు. రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గ‌త మూడేళ్ల నుంచి కృషి చేస్తున్నామ‌ని సీఎం తెలిపారు. 


logo