గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:12

దుబ్బాక.. గులాబీ కోట

దుబ్బాక.. గులాబీ కోట

  • ఆదినుంచి ఉద్యమాల గడ్డ
  • టీఆర్‌ఎస్‌ వైపే ఓటర్లు
  • అన్నిరంగాల్లో ప్రగతి పరుగులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన దుబ్బాక గడ్డ టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట. గ్రామీణులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కారువెంటే నడుస్తున్నది. ఇక్కడి ప్రజలు ఒక జర్నలిస్టును శాసన సభకు పంపారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డికి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా పట్టం కట్టారు. ప్రగతికి బాటలు పరుచుకున్నారు. 2009 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. 2004 సాధారణ ఎన్నికల్లో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక ) టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందా రు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై నాన్చుడు ధోరణిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో 62,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి.. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఆయన 7వ స్థానంలో నిలిచారు. అనారోగ్యం కారణంగా సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూయడం.. ఉపఎన్నిక అనివార్యమై దుబ్బాకలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇంటింటికీ నీళ్లు.. చెరువుల పునరుద్ధరణ

తెలంగాణ ఏర్పడ్డాక దుబ్బాక నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. అన్నిరంగాల్లో అభివృద్ధిచేశారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సమీకృత భవనాల నిర్మాణాలు, సీఎం కేసీఆర్‌ చదువుకున్న పాఠశాల పునర్నిర్మాణ పనులతోపాటు రహదారులు, మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరించారు. నియోజకవర్గకేంద్రంలో రామసముద్రం చెరువును సుందరీకరించారు. చెరువులో బోట్‌ సదుపా యం ఏర్పాటుచేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రా మాల్లో మిషన్‌ భగీరథ కింద నల్లాల ద్వారా తాగునీరు అందించండంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.  చేనేత, బీడీ కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నారు.  సుమా రు 56వేల పైచిలుకు ఆసరా పెన్షన్‌దారులు ఉన్నారు. logo