సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 14:54:39

పెండ్లి పనులు చేసినంత శ్రద్ధగా ఓటరు నమోదును చేపట్టాలి

పెండ్లి పనులు చేసినంత శ్రద్ధగా ఓటరు నమోదును చేపట్టాలి

ములుగు : ఇంట్లో పెండ్లి పనులు చేసినంత శ్రద్ధగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్- ఖమ్మం - నల్గొండ నియోజక వర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో కొంత అయోమయం జరిగింది. గతంలో ఓటర్లుగా ఉన్నవారి నమోదు సరిగా జరగలేదన్నారు.

 ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ వల్ల కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అయితే వీటన్నిటినీ అధిగమించి మన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక్క ఓటర్‌ను నమోదు చేయకున్నా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. మన అభ్యర్థి గెలుపు పై సందేహం లేదు. అయితే ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్పే విధంగా ఈ ఫలితాలు ఉండాలన్నది సీఎం కేసిఆర్  ఆలోచన అని వివరించారు. ఈరోజు ఈ ములుగు బ్రహ్మడంగా అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం సీఎం కేసిఆర్ అని పేర్కొన్నారు.


 బిల్ట్ కార్మికులకు చేయాల్సిన పని అంతా చేస్తున్నామని సీఎం కేసిఆర్ చెప్పారు. కావున ఇప్పుడు ఎవరు గెలిస్తే పనులు అవుతాయి. ఎవరు చెపితే అవుతాయో ఆలోచించి ఓటు వెయ్యాలన్నారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే కనపడక పోయేది. త్వరలో కూర్చొని జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నాం. ములుగు జిల్లా ఆఖరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చి సస్య శ్యామలం చేసే బాధ్యత మాదని హామీనిచ్చారు. మిగిలిన ఓటర్ల నమోదు పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్  కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ నాగ జ్యోతి,  ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యులు గోవింద్ నాయక్, హరిబాబు, భవాని, శ్రీదేవి, శ్రీనివాస్ రెడ్డి, పల్లా బుచ్చయ్య, రజిత, వాణిశ్రీ, చంద్రయ్య, రామాచారి, రుద్రమదేవి, భిక్షపతి, సమ్మయ్య, సునిల్ కుమార్, రమేష్, శ్రీధర్ ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.