e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home టాప్ స్టోరీస్ ఈటలకు ఓటెందుకెయ్యాలె?

ఈటలకు ఓటెందుకెయ్యాలె?

ఈటలకు ఓటెందుకెయ్యాలె?
  • కాల్‌సెంటర్‌ మహిళను ప్రశ్నించిన ఓటరు
  • సోషల్‌ మీడియాలో ఆడియో క్లిప్‌ వైరల్‌

హుజూరాబాద్‌ రూరల్‌, జూలై 14: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌కు ఓటెయ్యాలని కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌చేసిన మహిళకు దిమ్మతిరిగేలా ఓ ఓటరు ప్రశ్నలు సంధించారు. ఈటల రాజేందర్‌కు ఎందుకు ఓటు వేయాలని ఉతికి ఆరేసిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా..

  • కాల్‌ సెంటర్‌ నుంచి మహిళ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈ సారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్‌ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం సార్‌.
  • ఓటరు: ఎందుకు వెయ్యాలె?
  • మహిళ: సార్‌..
  • ఓటరు: ఎందుకు వెయ్యాలె ఈటల రాజేందర్‌కి అంటున్నా..
  • మహిళ: సార్‌.. ఆయన ప్రజల మనిషి. ప్రజల కష్టాలు, సమస్యల మీద పోరాటం చేస్తున్నడు సార్‌.. ఆయన్ను గెలిపిస్తే హుజూరాబాద్‌ అభివృద్ధి చెందుతుంది.
  • ఓటరు: ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసిండు?. ఆయన ఆస్తులు సంపాదించుకొని పోయిండు.
  • మహిళ: సార్‌..
  • ఓటరు: ఆయన భూకబ్జా ఆరోపణల మీద పోయిండు బయటికి.. ఆయన ఆస్తులు సంపాదించుకున్నడు కానీ, ఏం అభివృద్ధి చేసిండు?
  • మహిళ: సార్‌.. లేదండి అవన్నీ ఆరోపణలు.
  • ఓటరు: ఆరోపణలు అయితే ఆగాలె కదా.. రెండు మూడు రోజులకే ఎందుకు రాజీనామా చేసిండు
  • మహిళ: సార్‌.. ఆయన ఆల్‌రెడీ అడిగిండు సార్‌.. సిట్టింగ్‌ జడ్జితో వెళ్దామని అడిగిండు.
  • ఓటరు: ఆగితే మంచిగుండు కదా?
  • మహిళ: ఆత్మగౌరవం కోసం పోయిండు.
  • ఓటరు: ఆత్మగౌరవం ఉంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి కానీ బీజేపీకి ఎందుకు పోయిండు?
  • మహిళ: మెజార్టీ ఉన్న పార్టీ అని బీజేపీకి పోయిండు. అక్కడ అభివృద్ధి జరుగుతుందని..
  • ఓటరు: బీజేపీ అయితే ఆ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన్రు.
  • మహిళ: ఫోన్‌ కట్‌.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటలకు ఓటెందుకెయ్యాలె?
ఈటలకు ఓటెందుకెయ్యాలె?
ఈటలకు ఓటెందుకెయ్యాలె?

ట్రెండింగ్‌

Advertisement