మొబైల్ నుంచే ఓటర్‌కార్డు డౌన్లోడ్

- రేపటి నుంచి కొత్తవిధానం అమలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఓటర్ గుర్తింపుకార్డును ఇకపై మొబైల్ఫోన్తోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ఫోన్ల నుంచి పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. మొ బైల్లోనూ ఎపిక్కార్డును స్టోర్ చేసుకోవచ్చు. జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ఈ-ఎపిక్ (ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీ ఓటర్‌కార్డు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ట్టు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాల యం తెలిపింది. ఈ నెల 25 నుంచి 31 వరకు ముందు గా రిజిస్టర్డ్ మొబైల్ఫోన్ల ద్వారా ఈ-ఎపిక్ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. వచ్చేనెల ఒకటినుంచి ఓటర్లందరూ వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ ఫర్ ఎపిక్ అనే పేరుతో అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్ పోర్టర్ http://voterportal.eci.gov.in లో ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ అండ్రాయిడ్ https://play. google.com/store/apps /details?id=com.ecicitizen, ఐఎస్వో అయితే http://apps.apple.com/in/app/ voter-helpline/id1456535004 ల ద్వారా కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.