సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 17:58:44

ఓటు నమోదు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి

ఓటు నమోదు మన ఇంటి నుంచే  ప్రారంభం కావాలి

ఖమ్మం : రానున్న ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా నేటి పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను మన ఇంటి నుంచి ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఆన్లైన్, ఆఫ్ లైన్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తన ఓటు, తన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి ఓటుతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, కార్యకర్త తన వంతుగా మీ పరిసరాల్లో ఉండే పట్టభద్రుల ఓటును మన కార్యాలయంలో నమోదు చేయించాలి. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, మీకు అప్పగించిన నమోదులో మీ అమూల్యమైన ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా పట్టభద్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.


నేటి నుంచి (అక్టోబర్ 1) మీ ఓటు నమోదు చేయాలని చివరి తేదీ నవంబర్ 6 అయినప్పటికీ అప్పటి వరకు సమయం తీసుకోకుండా.. దసరా లోగా  నమోదు ప్రక్రియ పూర్తి కావాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదరి, ఎన్నికల ఇంచార్జి నూకల నరేష్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి తాత మధు, కార్యాలయ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, నగర్ అధ్యక్షుడు కమర్తపు మురళి కార్పొరేటర్లు ఉన్నారు.


logo