సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. ఓటు

నగర ఓటరుకు నయా సవాల్..! ! ! వరదలప్పుడు పైసలు పంచేవారికంటే.. వరదలు రాకుండా ప్రణాళిక చేసేవారికే ఓటు.. ఉచిత విద్యా, వైద్యంతో ప్రజలకు భరోసా ఇచ్చేవారికే ఓటు.. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురిచేయనివారికే ఓటు.. అడుగడుగున పబ్బులు, బార్లు, వైన్స్ లాంటి గబ్బు లేకుండా చేసేవారికే ఓటు.. పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోనివారికే ఓటు.. గాలి వాగ్దానాలు చేసేవారికంటే..ప్రజలకోసం గట్టిగా పనిచేసేవారికే ఓటు.. పేదల ఓటును కొనాలనుకునేవారికి చెబుదాం గుణపాఠం.. మాయమాటల నయవంచకులకు..కీలెరిగి వాతపెడదాం.. ఓటు తప్పక వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం.. - శ్రీచంద్ర, చిత్రకారుడు
టీఆర్ఎస్కే మద్దతు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. అభివృద్ధిని కాంక్షిస్తూ విశ్వనగరం, ప్రశాంతనగరం కోసం పరితపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పలు సంఘాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా, మేడ్చల్ జిల్లా పీఆర్టీయూ, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్కు జైకొట్టాయి.
గులాబీ పార్టీ వెంటే మేడ్చల్ జిల్లా పీఆర్టీయూశాఖ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు పీఆర్టీయూ మేడ్చల్ జిల్లాశాఖ ప్రకటించింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొన్నది.
అండగా ఉంటాం
ఒకప్పుడు విద్యుత్ ఉద్యోగులంటే ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా.. ఇప్పుడు మేమంటే గౌరవం, ఆదరణ లభిస్తున్నది. సంస్కరణల పేరుతో విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలను కేసీఆర్ వ్యతిరేకించి, తీర్మానం చేశారు. విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రిని మరెక్కడా చూడలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) తరఫున టీఆర్ఎస్కు పూర్తి అండగా ఉంటాం.
- పాపకంటి అంజయ్య, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి
నవ తెలంగాణ నిర్మాతకే మా ఓటు
23 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థల ఉద్యోగులుగా గుర్తించడంతో వారందరికి ఆర్థిక, సామాజిక భరోసా దక్కింది. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి, విద్యుత్‌రంగ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మేమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఈఈజేఏసీ తరఫున టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నవ తెలంగాణ నిర్మాతకే మా ఓటు.
- కోడూరి ప్రకాశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
తాజావార్తలు
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్