బుధవారం 27 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 22:31:29

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి : మంత్రి సత్యవతి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి : మంత్రి సత్యవతి

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్‌ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గీత ప్రవీణ్ ముదిరాజ్‌కు మద్దతుగా డివిజన్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం పలు కాలనీల్లో ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయా కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిలుకానగర్‌ డివిజన్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. చిలుకానగర్‌ను దత్తత తీసుకొని మోడల్‌ డివిజన్‌గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు రాగానే ఓట్లు అడిగేందుకు అన్ని పార్టీల నేతలు ప్రజల వద్దకు వస్తుంటారని, కానీ జీహెచ్‌ఎంసీ ఓటర్లు చైతన్యవంతులన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడుతున్నది ఎవరు? ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందనే ఆలోచన ఉన్నవాళ్లన్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ఎన్నో హామీ ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి నిరంజన్ భాస్కర్, తాజామాజీ కార్పొరేటర్‌ గోపు సరస్వతి సదానందం గౌడ్, జెల్లీ మోహన్, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.logo