గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 21:27:30

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటర్లను కోరారు. మీర్‌పేటలో అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్‌కు మద్దతుగా కార్యకర్తలు, నేతలతో కలిసి హైసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లోని ఫేస్‌-1, ఫేస్‌-2 కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిస్తూ కారు గుర్తుకు ఓటేసి ప్రభుదాస్‌ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రస్తుతం నగరానికి వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఇంకా వస్తాయన్నారు. అంతకు ముందు శాంతినగర్‌, కైలాసగిరిలో పార్టీ కార్యాలయాలను ప్రాంభించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo