మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 16:22:17

అభివృద్ధికి ఓటేయండి : ఎమ్మెల్యే మాధవరం

అభివృద్ధికి ఓటేయండి  : ఎమ్మెల్యే మాధవరం

మేడ్చల్‌ మల్కాజిగిరి : అభివృద్ధికి పట్టం కట్టండని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ గంగపుత్ర సంఘం మహంకాళి ఆలయంలో ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం బస్తీలో ఇంటింటికి తిరుగూ గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓల్డ్‌బోయిన్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుత కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌ పోటీచేస్తున్నారని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాపత్రయపడుతూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.


మ్యుమంత్రి కేసీఆర్‌, పురపాలకవాఖ మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌లో ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో కోట్లాధి నిధులు కేటాయించి డివిజన్‌ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఆయన తెలిపారు. డివిజన్‌ ప్రజలు అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్పొరేటర్‌ నర్సింహయాదవ్‌ మాట్లాడుతూ.. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

 డివిజన్‌ ప్రజల సంక్షేమానికి ప్రధాన్యతనిస్తూ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కూకట్‌పల్లి ఎబ్మల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను ఎంతో అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్‌గౌడ్‌, కర్రె జంగయ్య, కర్రె లావణ్య, సయ్యద్‌ ఎజాజ్‌, ఇర్ఫాన్‌, మక్కల నర్సింగ్‌, ఖదీర్‌, నర్సింగ్‌రావు, సత్యమూర్తి, పోచయ్య, శంకర్‌, లలిత, ఉదయరాణి, దుర్గ, ఉమ, అనురాధలతో పాటు వార్డుకమిటి సభ్యులు , ఏరియా కమిటీ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.