సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 13:00:48

ఇందూరులో వ్యాపారస్తుల స్వచ్ఛంద లాక్ డౌన్

ఇందూరులో వ్యాపారస్తుల స్వచ్ఛంద లాక్ డౌన్

నిజామాబాద్ : కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ విజృంభిస్తున్నది. ప్రభుత్వ చర్యలకు తోడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా కట్టడిలో భాగస్వాములు అవుతున్నారు. కరోనా కట్టడి కోసం జిల్లా ప్రజలు ముందుకొస్తూ స్ఫూర్తినిస్తున్నారు.  నిజామాబాద్ పట్టణం కుమార్ గల్లీలో బంగారు దుకాణాల యజమానులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు. 

అలాగే కిసాన్ గంజ్ లో మార్చoట్ వ్యాపారుల స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. సెలూన్ షాపులు మధ్యాహ్నం 1 గంటల వరకే తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. ఆర్ముర్, బోధన్ పట్టణాల్లోనూ బంగారం వర్తకులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఎవరికి వారు స్వీయ రక్షణలు పాటిస్తూ.. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ముందుకెళ్తే కరోనాను సులభంగా కట్టడి చేయొచ్చు. విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.


logo