బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 16:55:10

శారదాపీఠంలో ముగిసిన విషజ్వర పీడాహరయాగం

శారదాపీఠంలో ముగిసిన విషజ్వర పీడాహరయాగం

విశాఖ శారదాపీఠం నిర్వహించిన విషజ్వర పీడాహర యాగం ముగిసింది. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన యాగం పీఠ యాగశాలలో 11 రోజుల పాటు కొనసాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిల పర్యవేక్షణలో అనేక మంది రిత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ...  కరోనా మహమ్మారిని తరిమికొట్టే నివారణోపాయం తెలియక ప్రపంచమంతా సతమతమవుతున్న తరుణంలో శారదాపీఠం విషజ్వర పీడాహర యాగం చేపట్టిందని చెప్పారు. 

11 రోజుల పాటు సాగిన యాగం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. భారతదేశం ప్రపంచానికే గురుస్థానంలో ఉందని, వేదాల్లో పొందుపరిచిన అనేక అంశాలను పరిశీలించి సర్వ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యాగం తలపెట్టామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధప్రదేశ్‌ సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను ప్రజలు తూచాతప్పకుండా పాటించాలని సూచించారు. 


logo