మంచిర్యాల : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ను ఓయూ క్యాంపస్‌లో కలిసి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే సన్మానించారు. గతంలో పీజీ, ఆర్ట్స్ కళాశాలా ప్రిన్సిపాల్స్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన రవీందర్ సార్ వైస్ చాన్సలర్ హోదాలో యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి గొప్పగా కృషి చేస్తారని ఆకాంక్షించారు.
కరీంనగర్లో..
శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ సంకసాల మల్లేశంను విప్ బాల్క సుమన్ ఆ యూనివర్సిటీ క్యాంపస్ లో కలిసి సన్మానించారు. గతంలో నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఫిలాసఫీ హెడ్‌గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన వైస్ చాన్సలర్ హోదాలో యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి గొప్పగా కృషి చేస్తారని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్