ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:13:10

ప్రవేశ పరీక్షల తేదీలు మార్చండి.. వినోద్‌కుమార్‌ లేఖ

ప్రవేశ పరీక్షల తేదీలు మార్చండి.. వినోద్‌కుమార్‌ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 24 నుంచి 26 తేదీ వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో తలపెట్టిన పీజీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను వాయిదావేయాలని వైస్‌ చాన్స్‌లర్‌, ప్రొఫెసర్‌ అప్పారావును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. లేఖ ప్రతిని యూజీసీ చైర్మన్‌కు కూడా పంపించారు. వివిధ వర్సిటీల విద్యార్థులకు ఈ నెల 22 నుంచి అక్టోబర్‌ 13 వరకు ఫైనల్‌ ఇయర్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. 


logo