శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 14:46:25

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వినోద్‌ కుమార్‌

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వినోద్‌ కుమార్‌

రాజన్న సిరిసిల్ల : ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా శనిగరం వద్ద బద్ది పడగ వాగులు గల్లంతై మృతి చెందాడు. ఈ మేరకు శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కార్యకర్తల సంక్షేమానికి అండగా ఉంటున్నారని తెలిపారు.

శ్రీనివాస్ మృతి బాధాకరమన్నారు. మంచి కార్యకర్తను టీఆర్ఎస్ కోల్పోయిందన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పక్షాన మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ. 5లక్షలు అందించారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు మంత్రి కేటీఆర్ అండగా ఉంటారన్నారు. శ్రీనివాస్  ఇద్దరు కుమార్తెల చదువుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.