శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:09

నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు

నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఎవరూ వేడుకలను నిర్వహించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మిత్రులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా దురదృష్ట పరిస్థితుల్లో తాను జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నానని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి ఆశీస్సులు మాత్రమే అందించాలని కోరారు.logo