ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 16:22:16

హైకోర్టు సీనియర్ న్యాయవాది రాజారెడ్డి మృతిపై వినోద్ కుమార్ సంతాపం

హైకోర్టు సీనియర్ న్యాయవాది రాజారెడ్డి మృతిపై వినోద్ కుమార్ సంతాపం

హైదరాబాద్ : హైకోర్టు సీనియర్ న్యాయవాది కే. రాజారెడ్డి (84) మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 1974 నుంచి 1989 వరకు నాలుగు పర్యాయాలు రాజారెడ్డి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారని, 1979-84 కాలంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా వ్యవహరించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనేక సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా వ్యవహరించారని ఆయన తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ ఇంచార్జీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజారెడ్డి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


logo