శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 20:52:32

సీఐటీయు నాయ‌కుల‌తో వినోద్‌కుమార్ చ‌ర్చ‌లు

సీఐటీయు నాయ‌కుల‌తో వినోద్‌కుమార్ చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : సీపీఎం పార్టీకి అనుబంధంగా ఉన్న సీ.ఐ.టీ.యు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరయ్యతో రాష్ర్ట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి. వినోద్‌కుమార్ బుధ‌వారం స‌మావేశమ‌య్యారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతున్న విషయాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలకు నిరసనగా గురువారం నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. లాభాల బాటలో నడుస్తున్న ఎల్.ఐ.సీ., బీ.ఎస్.ఎన్.ఎల్, రైల్వే, హెచ్.ఏ.ఎల్. వంటి అనేక సంస్థలను నట్టేట ముంచుతున్న ప్రధాని మోదీ చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశంలో వెంకటేష్, భాస్కర్, ఏ.ఐ.టీ.యు.సీ. నాయకులు నరసింహన్, బోస్, నర్సింహా, బాలరాజు, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఇంచార్జీ రూప్ సింగ్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు యాదవ రెడ్డి, తదితరులు ఉన్నారు.