ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 02:27:12

కేంద్రం తీరు దురదృష్టకరం

కేంద్రం తీరు దురదృష్టకరం

  • నేషనల్‌ హైవే పనుల నుంచి తప్పుకోవడం సిగ్గుచేటు
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ఆగ్రహం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: జగిత్యాల నుంచి వరంగల్‌ వరకు ఉన్న రహదారిని తాను ఎంపీగా ఉన్న సమయంలో 563వ జాతీయ రహదారిగా గుర్తించారని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పనుల నుంచి తప్పుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియా సమావేశం లో వినోద్‌కుమార్‌ మాట్లాడారు. కరీంనగర్‌ను జాతీయ రహదారులతో అనుసంధానం చేసి జంక్షన్‌గా మార్చాలని, ఐదు జాతీయ రహదారులను తీసుకువచ్చేందుకు గతంలో తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి వరంగల్‌ రహదారిని కేంద్రం  జాతీయ రహదారిగా గుర్తించిందన్నారు. తాజాగా ఆ పనుల నుంచి తప్పుకోవడం దురదృష్టకరమన్నారు.


logo