గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 20:08:23

గుండా మల్లేశ్ మ‌ర‌ణం తీర‌ని లోటు : వినోద్ కుమార్‌‌

గుండా మల్లేశ్ మ‌ర‌ణం తీర‌ని లోటు : వినోద్ కుమార్‌‌

హైద‌రాబాద్ : సీనియర్ కమ్యూనిస్టు నేత, నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా ప‌నిచేసిన గుండా మల్లేశ్ మరణం పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని రాష్ర్ట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. గుండా మ‌ల్లేశ్ మృతిపై ఆయ‌న స్పందిస్తూ... అనేక ఉద్యమాలతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నో ప్రజా సమస్యలపై మ‌ల్లేశ్‌ గళాన్ని వింపించార‌న్నారు. నలభై సంవత్సరాలుగా వారితో పరిచయంలో ఎన్నో అంశాల్లో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి వరంగల్ లేబర్ కోర్టులో వారు నిరంతరం కృషి చేస్తూ వచ్చారన్నారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


logo