మంగళవారం 07 జూలై 2020
Telangana - Feb 28, 2020 , 20:21:34

కశ్మీర్‌కు ఒక న్యాయం..ఏపీ‌, తెలంగాణకు మరో న్యాయమా?

కశ్మీర్‌కు ఒక న్యాయం..ఏపీ‌, తెలంగాణకు మరో న్యాయమా?

హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విమర్శించారు. కేంద్రానికి అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. కశ్మీర్‌కు ఒక న్యాయం..ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. కశ్మీర్‌లో 7 అసెంబ్లీ స్థానాలు పెంచి..ఏపీ, తెలంగాణలో ఎందుకు పెంచరని కేంద్రాన్ని అడిగారు. ఒకే దేశం-ఒకే చట్టం నినాదం ఏమైందని? ప్రశ్నించారు.  అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఏపీ, తెలంగాణ ప్రజలు కోర్టులో సవాల్‌ చేస్తారని వినోద్‌ కుమార్‌ తెలిపారు. 


logo