సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 11, 2020 , 01:17:55

కరోనా కట్టడికి కేసీఆర్‌ చర్యలు భేష్‌

కరోనా కట్టడికి కేసీఆర్‌ చర్యలు భేష్‌

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస
  • రాష్ట్రంలో పరిస్థితులపై వినోద్‌కుమార్‌తో ఫోన్‌లో ఆరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు  చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు.  వైరస్‌ను తుదముట్టిం చే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఫోన్‌చేసి రాష్ట్రంలోని తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ ఉపరాష్ట్రపతికి వివరించారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలుచేస్తున్నామని, పేదలు, వలస కార్మికులను ప్రభుత్వపరంగా ఆదుకుంటున్నామని చెప్పారు. దాతలను ప్రోత్సహించడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, అవసరమైనచోట భోజన వసతి కల్పిస్తున్నామని వినోద్‌కుమార్‌ తెలిపారు.


logo