మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 19:20:25

‘టిస్ సలహా మండలి సభ్యుడిగా వినోద్ కుమార్ నియామకం’

 ‘టిస్ సలహా మండలి సభ్యుడిగా వినోద్ కుమార్ నియామకం’

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ( TISS )  సలహా మండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. రెండేండ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వహించనున్నారు. 1964 సంవత్సరంలో టిస్ ను గ్రేడ్ వన్ డీమ్డ్ యూనివర్సిటీ గా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) నిధులతో టిస్ నిర్వహణ సాగుతోంది. మహారాష్ట్రలోని ముంబయిలో ముఖ్య క్యాంపస్ ఉండగా 

హైదరాబాద్ సహా మహారాష్ట్రలోని తుల్జాపూర్, అస్సాంలోని గువాహతిలలో క్యాంపస్ లు ఏర్పాటయ్యాయి. 1936 సంవత్సరంలో సర్ దోరబ్జీ టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ గా స్థాపించబడ్డ సంస్థను 1964 లో కేంద్ర ప్రభుత్వం టిస్ గా మార్చుతూ.. డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పించి యూజీసీ నిధులు సమకూర్చింది. 

సీనియర్ పార్లమెంటేరియన్, పరిపాలనా పరంగా ప్రతి అంశంపై అవగాహన ఉండటం, న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం ఉండటం, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తుండటం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని బోయినపల్లి వినోద్ కుమార్ ను సలహా మండలి సభ్యుడిగా టిస్ ఎంపిక చేసింది. టిస్ చైర్మన్ ఎస్. రామదొరై నిర్ణయాన్ని హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాలిని భరత్ ప్రకటించారు.


logo