శనివారం 30 మే 2020
Telangana - May 15, 2020 , 17:05:18

రసమయికి వినోద్‌కుమార్‌ శుభాకాంక్షలు

రసమయికి వినోద్‌కుమార్‌ శుభాకాంక్షలు

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కరీంనగర్‌ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు వినోద్‌కుమార్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మానకొండూరు నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌ తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యంతో ఎంతో మంది ఉద్యమకారులకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉపాద్యాయ వృత్తి నుంచి ఉద్యమంలోకి వచ్చిన రసమయికి కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండడంతో తెలంగాణ రాష్ట్రం రాగానే జరిగిన మొదటి ఎన్నికల్లో మానకొండూరు నుంచి ఎమ్మెల్యేగా నిలపడే అవకాశం దక్కించుకున్నారు. 

అలాగే కష్టపడి ఎన్నికల్లో గెలిచి అభివృద్దిలో పోటీ పడుతూ రెండో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు రసమయి. దీంతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కూడా రసమయికి కేసీఆర్‌ అవకాశం కల్పించారు. అయితే ఈ రోజు రసమయి పుట్టిన రోజు సందర్భంగా బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేధికగా రసమయికి గతంలో కేక్‌ తినిపిస్తున్న ఫోటో పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.logo