శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:22:51

బీజేపీ నేత రఘనందన్‌కు షాక్‌

బీజేపీ నేత రఘనందన్‌కు షాక్‌

రాయపోల్‌ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావుకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాయపోల్‌ మండలం తిమ్మక్కపల్లిలో ప్రచారానికి వచ్చిన రఘునందన్‌రావును గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో ప్రచారం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రఘునందన్‌రావు ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేయించారు. నిరుపేదల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని గ్రామస్థులు రఘునందన్‌రావుకు జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుచరులకు, గ్రామస్థులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, ఎన్నికల సమయంలోనే కనిపించే నాయకులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కులేదని గ్రామస్థులు అన్నారు. దీంతో చేసేదేమిలేక రఘునందర్‌రావు మధ్యలోనే గ్రామం నుంచి వెళ్లిపోయారు.logo